అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
పరిపాలన విభాగంలో ఏబీవీపీ కుట్రలను బయటపెడతాం: వర్సిటీ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే పెద్ద ప్రాధాన్యత కలిగిన యూనివర్సిటీలో ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఇలాంటి యూనివర్సిటీలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా విద్యార్థి సంఘాలను రద్దు చేయాలని పరిపాలన విభాగం.. ఏబీవీపీ నాయకులతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల రద్దు నిర్ణయాన్ని యూనివర్సిటీలో ఏబీవీపీ తప్ప మిగతా అన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఏబీవీపీ కుట్రలను బయటపెడతామని హెచ్చరించారు.
హెెచ్‌సీయూ విద్యార్థి సంఘాల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES