నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి శుక్రవారం జరగనుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏచూరి వర్ధంతి సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ ఆఫీసు కార్యదర్శి జె బాబురావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఐ(ఎం), వామపక్ష పార్టీల శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ‘భారతీయ భావన- వాస్తవం- వక్రీకరణ’అనే అంశంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రధాన వక్తగా ప్రసంగిస్తారని తెలిపారు. వక్తలుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతోపాటు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్‌రాజా, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బి సురేందర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
రేపు హైదరాబాద్‌లో ఏచూరి ప్రథమ వర్ధంతి సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES