Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌కు ఓటేస్తే…

కాంగ్రెస్‌కు ఓటేస్తే…

- Advertisement -

మీ ఇండ్లు కూలగొట్టమని లైసెన్స్‌ ఇచ్చినట్టే
వారి అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇండ్లను కూలగొట్టమని లైసెన్స్‌ ఇచ్చినట్టే అవుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. తమకు ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామంటూ కాంగ్రెస్‌ బెదిరిస్తోందని ఆయన ఆరోపిం చారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరిస్తూ కాంగ్రెస్‌ నేతలు కోట్ల రూపా యలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్య మంటే ఇండ్లు కూలగొట్టడమేనని ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అనీ, ప్రధానమంత్రి మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్న నిజాన్ని మైనార్టీలు తెలుసుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికలో పంచి గెలవడానికి రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఒక్క మంచి పని చేయని రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండి పడ్డారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, తమ అసమర్థతను అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారన్నారు. ఇటీవల గణేష్‌ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదన్న కేటీఆర్‌, ప్రభుత్వంతో ప్రజలు డిస్‌కనెక్ట్‌ అయ్యారనడానికి అదే నిదర్శనమన్నారు. డబ్బున్న పెద్దల జోలికి హైడ్రా పోవడం లేదనీ, దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ వ్యతిరేకించే బీజేపీ, మోడీ, సీబీఐ లాంటి అంశాల్లో కాంగ్రెస్‌ భావజాలానికి వ్యతిరేకంగా రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌, గతంలో బీఆర్‌ఎస్‌ అమలు చేసిన కార్యక్రమాలను కూడా రద్దు చేశారని తెలిపారు.

మాగంటి కుటుంబానికి ప్రజలు అండగా నిలబడాలి
నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చిన దివంగత నేత మాగంటి గోపీనాథ్‌ అండగా నిలబడేవారని కేటీఆర్‌ స్మరిం చుకున్నారు. ఆయన కుటుంబానికి జూబ్లీహిల్స్‌ నియోజక వర్గ ప్రజలు అండగా ఉండాలని కోరారు. జూబ్లీహిల్స్‌ లో బీఆర్‌ఎస్‌ పరిస్థితి మెరుగ్గా ఉందని అన్ని సర్వేలు చెబుతు న్నాయనీ, బంపర్‌ మెజార్టీ కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్త లకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీలోపు ప్రతి ఇంటికి వెళ్లి, గోపినాథ్‌ చేసిన పనులు, సేవలను ఓటర్లకు గుర్తుచేయా లన్నారు. బీఆర్‌ఎస్‌ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయించాలని సూచించారు. యుద్ధంలా పోరాడి తేనే విజయం సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రహ్మత్‌ నగర్‌ ఇంచార్జీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, మాజీ మంత్రి గంగుల కమలా కర్‌, మాజీ ఎమ్మెల్యేలు వినరు భాస్కర్‌, పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, దివంగత మాగంటి గోపినాథ్‌ సతీమణి మాగంటి సునీతతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad