-మెడికల్ సీటు సాధించిన విద్యార్దికి ఆర్థిక సహాయం..
నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో నివాసముంటున్న నాగార్జున పేట గ్రామానికి చెందిన వడిత్య తావు కుమారుడు వడిత్య మధు నాయక్ ఆల్ ఇండియా నీట్ యుజి మెడికల్ లో రూ. 23,000 ర్యాంకు సాధించారు. ఈ విషయం నేనావత్ శంకర్ నాయక్ ద్వారా తెలుసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న గురువారం పాట్నా లో మెడికల్ సీటు సాధించిన మధు నాయక్ కి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మధును ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి,అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,చింతలపాలెం మాజీ సర్పంచ్ సైదారావు,బట్టువెంకన్న బావి తండా మాజీ సర్పంచ్ దేవు నాయక్,పర్వేదుల ఆదిరెడ్డి,కోడుమూరు వెంకటరెడ్డి, ఆంజనేయులు,రాజు,రాహుల్,కార్తీక్, షేక్ అబ్దుల్ కరీం,గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అండగా బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES