Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నానో యూరియాపై అవగాహన కరువు.?

నానో యూరియాపై అవగాహన కరువు.?

- Advertisement -

నానో యూరియా వినియోగంపై అనాసక్తి
ఎలా వాడాలో తెలియని రైతులు
అవగాహన కల్పిస్తేనే మేలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మారుతున్న కాలానికనుగుణంగా వ్యవసాయరంగం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్త పుంతలు తొక్కుతోంది. సాగులో ఖర్చులు తగ్గించి అధిక దిగుబడి సాధించేందుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రైతుల పంటలకు వేస్తున్న గుళికల రూపంలో ఉన్న యూరియా వల్ల భూసారం దెబ్బతింటుంది. యూరియా వినియోగాన్ని తగ్గించేలా నానో యూరియా (ద్రవ రూపంలో)ను అందుబాటులోకి వచ్చింది.

కానీ వీటి వినియోగంపై రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో కొనుగోలుకు ఆసక్తిచూపడం లేదు. ఎలా వినియోగించాలి, పం టకు ఎంత మేర అందుతుందనే దానిపై అవ గాహన కొరవడింది. సాధారణ యూరియాను చల్లడం మాత్రమే తెలుసు. అయితే నానో యూరియా ప్రయోజనాలు, వినియోగంపై వివ రాలను రైతులకు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.మండలంలో పెద్దతూండ్ల, తాడిచెర్ల, రుద్రారం, కొయ్యుర్  నాలుగు సెక్టార్లలో ఎక్కడ రైతులకు నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించిన దాఖలాలు కనిపించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నానో యూరియాతో ప్రయోజనాలెన్నో..

నానో యూరియాతో రైతులకు అనేక ప్రయో జనాలు ఉన్నాయి. సాధారణ యూరియాను పంటకు చల్లడం ద్వారా 30 శాతం మాత్రమే వెళ్తుందని అధికారులు పేర్కొంటున్నారు.యూరియా ఖర్చు ఎక్కువ. నానో యూరియాతో తక్కువ ఖర్చు ఉంటుందని, 80 శాతం పంటకు వెళ్తుందని చెబుతు న్నారు. అరలీటర్ సీసాలో లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానం. రాయితీ పోను బస్తా ధర రూ.266 ఉండగా, నానో యూరియా రూ.240కే లభ్యమవుతుంది. సాధారణంగా ఒక ఎకరాకు అర లీటర్ నానో యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారులు అంటున్నారు.యూరియా తర్వాత రసాయన నానో డీఏపీని అందుబాటులోకి తెచ్చారు. ఒక బస్తా డీఏపీకి 500మిల్లీలీటర్ల నానో డీఏపీ సీసాతో సమానం. బస్తా డీఏపీ ధర రూ.1350 ఉండగా, నానో డీఏపీ రూ.600కే లభిస్తుంది. ఖర్చు తక్కువతో పాటు పంటకు కావాల్సిన యూరియా సరిపడా అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

అవగాహన కల్పిస్తే రైతులకు మేలు

మండల వ్యాప్తంగా రైతులు 22,250 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం ఉంటుంది. ఎరువుల ధరలు రైతులకు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నానో యూరియా రైతులకు వరంగా మారింది. అయితే చాలామంది రైతులు అవగాహన లేక నానో యూరియాను వాడ టానికి ఇష్టపడటం లేదు. గ్రామాలకు వెళ్లి నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ధర తక్కు వగా ఉండటంతో వారికి భారం తగ్గే అవకాశం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -