పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన!
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్లకు పైగా పేరుకుపోయిన బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ లో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కి సంబంధించిన నిధులను గత మూడు సంవత్సరాలుగా నిధులను విడుదల చేయటం లేదని పేద విద్యార్థులపైన ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ,ఈ విద్యా సంవత్సరం విద్యార్థులే పుస్తకాలు యూనిఫామ్ లు కొనుక్కుంటున్నారని , బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ స్కూల్స్ పాఠశాలలు మేము నిర్వహించలేము అని చేతులెత్తేస్తున్నారని అన్నారు.
పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విద్యార్థులు చదువుకునే స్కీమ్ కి నిధులు కేటాయించకపోవటం వారిపై ఆర్ధిక భారమేనని అన్నారు, ఈ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ కి చెందిన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంలో ప్రైవేట్ పాఠశాలలో విద్యను అందిస్తున్నారు కానీ వాటికి బిన్నంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ పెండింగ్ బకాయిలు చేయకపోవటం వలన విద్యార్థుల తల్లితండ్రులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు,జిల్లాలో 9 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని లేనిచో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నగర నాయకులు మనోజ్,సాయి కిరణ్, వంశీ, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.