నవతెలంగాణ – కంఠేశ్వర్
జేసిఐ వారోత్సవం 3వ రోజు కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య రక్ష నేచర్ క్యూర్ యోగ ట్రైనర్ డాక్టర్ ఐశ్వర్య ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిబిరం గురువారం నిర్వహించారు. ఇందులో రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను విశదీకరించారు. డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ..యోగా శరీరాన్ని బలపరచడమే కాకుండా, మనసును పదునుగా మార్చి జీవనశైలిలో ఆరోగ్యానికి సమతుల్యతను తీసుకువస్తుందని చెప్పారు.
గృహిణి అయినా, ఉద్యోగి అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జీవితంలో చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత పొందవచ్చు. రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాలు యోగకు కేటాయించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, సమగ్ర ఆరోగ్యం మెరుగుపడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జేసీఐ ఇందరు అధ్యక్షులు గౌతమి పెండోటి సభ్యులు,మహిళలు పాల్గొన్నారు.
జేసిఐ వారోత్సవం 3వ రోజు కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES