నవతెలంగాణ పత్రికకు స్పందన
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మిర్జాపూర్ గ్రామ కార్యదర్శి రవి తెలిపారు. గురువారం మిర్జాపూర్ గ్రామంలోని రెండు మూడు ఆరు వార్డుల్లో ఇంటింటికి తిరిగి నీటి సమస్యను పరిష్కరించారు. బుధవారం గ్రామంలో కొందరు త్రాగునీరు రావడం లేదంటూ నిరసన వ్యక్తం చేయడంతో నవతెలంగాణ పత్రిక మిర్జాపూర్ త్రాగునీటి కష్టాలు అనే శీర్షిక ప్రచరితం కావడంతో స్పందించిన గ్రామ కార్యదర్శి సింగల్ ఫేస్ పంపు కు మరమ్మతులు జరిపి త్రాగునీరు వచ్చేలా చూశారు. అలాగే ఆయా వార్డులో మిషన్ భగీరథ తాగునీరును అవార్డులకు వచ్చేలా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో ప్రతి ఇంటికి తాగుతున్నారు అందించడమే తమ లక్ష్యం అన్నారు. గ్రామంలో పలు వార్డులో త్రాగునీరు రాకపోవడంతో తాగునీరు అందించినందుకు గ్రామ కార్యదర్శి రవి కి అభినందించారు.
మిర్జాపూర్ లో తాగునీరు సరఫరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES