Thursday, September 11, 2025
E-PAPER
Homeఖమ్మంమండలంలో ఎమ్మెల్యే జారె విస్త్రుత పర్యటన

మండలంలో ఎమ్మెల్యే జారె విస్త్రుత పర్యటన

- Advertisement -


– హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా
– నియోజక వర్గంలో రూ.13 కోట్లు తో నూతన దారులు నిర్మాణం
– విలేకర్లు సమావేశంలో జారె ఆదినారాయణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. గురువారం మండలంలో విస్త్రుతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు నిర్వహించిన అనంతరం తన అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ముందుగా ఆయన తిరుమలకుంట,ఆసుపాక, నారాయణపురం లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసారు. బచ్చువారిగూడెం లో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం శంకుస్థాపన, ఊట్లపల్లి లో విద్యుత్ ఘాతం తో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చెక్కు అందజేత, నారంవారిగూడెం లో రూ.4 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభం, అచ్యుతాపురం పంచాయితీ దిబ్బ గూడెంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎంపీపీఎస్ ప్రహరీ కి శంకుస్థాపన చేసారు. 

అనంతరం నియోజక వర్గంలో రూ. 13 కోట్ల 81 లక్షల వ్యయంతో నిర్మించే తారు రోడ్ల నిర్మాణంపై విలేకర్లు సమావేశం  లో మాట్లాడారు. దమ్మపేట మండలంలో రెండు గ్రామాల్లో 3 కి.మీ చొప్పున రూ.4 కోట్ల 16 లక్షల 9 వేలు,చండ్రుగొండ లో 1.8 కి.మీ మేర 1 కోటి 66 లక్షల 4 వేలు, ములకలపల్లి లో రెండు గ్రామాల్లో 2 కి.మీ మేర రూ.2 కోట్ల 73 లక్షల 89 వేల,అశ్వారావుపేట మండలం లో గాండ్లగూడెం నుండి చెన్నాపురం వరకు 5.80 కి.మీ పొడవున రూ.5 కోట్ల 25 లక్షల 37 వేలు వ్యయంతో నూతన రహదారులు నిర్మిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో పంచాయితీ రాజ్ డీఈ శ్రీధర్,ఏఈ అక్షిత,ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం  నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు,వేముల భారతి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -