– ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కామారెడ్డి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేదంటే ఈనెల 15న కామారెడ్డి లో జరిగే సీఎం సభను అడ్డుకుంటామని ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి మారుస్తానని ఇచ్చిన మాట మర్చిపోయాడన్నారు.
ఇచ్చిన హామీలను మర్చిపోతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉందన్నారు. కామారెడ్డి విజయోత్సవ సభకు ముందుగానే ముదిరాజుల ప్రకటన వెలబడాలన్నారు. లేకుంటే కామారెడ్డి లో జరిగే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్ ముదిరాజ్ , జిల్లా కార్యదర్శి బొల్లి శ్రీనివాస్ ముదిరాజ్ ,సీనియర్ నాయకులు భాష వేణి రాజయ్యముదిరాజ్ ,హుస్నాబాద్ సొసైటీ అధ్యక్షులు పొన్నం మల్లయ్య ముదిరాజ్ , పెసరు రాజయ్య,పెసరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయకుంటే సీఎం సభను అడ్డుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES