Thursday, September 11, 2025
E-PAPER
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో కౌలురైతు మృతి 

విద్యుత్ షాక్ తో కౌలురైతు మృతి 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
మండల పరిధిలోని ఇప్పకుంట గ్రామంలో కౌలు రైతుగా వ్యవసాయం చేస్తు విద్యుత్గు షాక్ కు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన మెంట సలేశ్వరం (32) ఇప్పకుంట గ్రామానికి చెందిన దారెడ్డి దామోదర్ రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని మక్క పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం రోజు పొలం పనులు అయిపోయాక భార్య రేణమ్మను ఇంటికి వెళ్ళమని తాను కొంచెం ఆలస్యం వస్తానని చెప్పడంతో ఇంటికి వెళ్లారని భార్య తెలిపినట్టు తెలిపారు. రాత్రి సమయం అయినప్పటికీ రాకపోవడంతో ఉదయాన్నే గురువారం వెళ్లి పొలంలో చూడగా విద్యుత్ శాఖ గురై మృతి చెంది పడి ఉన్నట్లు భార్య ఫిర్యాదు చేసిందని తెలిపారు. పొలంలో విద్యుత్తు కంచె ఏర్పాటు చేయబోయి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటారని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -