నవతెలంగాణ – సదాశివ నగర్
మిషన్ భగీరథ లీకేజీలు ఇంకెన్నాళ్లని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో తార్ రోడ్డుపై లికేజీ వల్ల పూర్తిగా రోడ్డు ధ్వంసం అయింది. దీనివలన ప్రజలు, వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. సుమారుగా ఈ లీకేజీ ఏర్పడి నెలలు గడిచినట్టు స్థానికులు తెలిపారు. లీకేజీ వలన పూర్తిగా తారు రోడ్డు చెడుపోవడం జరిగిందని తెలిపారు. మిషన్ భగీరథ ఎప్పటికీ ఏదో ఒక చోట లీకేజీలు జరుగుతున్నాయని అంటున్నారు. లీకేజీ వద్ద రోడ్డు అంతా గుంతలమయంగా మారిందని అంటున్నారు. గుంతలను చూసి పోలీసులు అక్కడ ప్లాస్టిక్ బారికేడ్ లను ఏర్పాటు చేశారు. దానివల్ల రాత్రి సమయంలో వాహనదారులు ఢీకొనే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి లీకేజ్ ని సరిచేసి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.
మిషన్ భగీరథ లీకేజీలు.. ఇంకెన్నాళ్లు.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES