Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభువనగిరిలో భారీ వర్షం..

భువనగిరిలో భారీ వర్షం..

- Advertisement -

భారీ ట్రాఫిక్ అంతరాయం..
ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు..
పిడుగుపాటుతో గేదె మృతి..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి వీధులని జలమయమయ్యాయి. కాగా గతంలో పట్టణ ప్రణాళిక , డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంతో వసుంధర థియేటర్ నుంచి ఖాజీ మహాల వెళ్లే చౌరస్తాలో వరద నీరు ఇంట్లోకి రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడే సందర్భంలో కనీసం వాళ్ళు కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. గత రెండు మూడు సంవత్సరాలు ఆ విషయంపై అధికారులకు మొరపెట్టుకున్న స్పందించడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి టాక్స్లు వసూలు చేసే మున్సిపల్ అధికారులు సౌకర్యాలు కల్పించడంలో, సమస్యలను తీర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

పిడుగుపాటుకు గేదె మృతి…

భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు వల్లపు పర్వతాలకు చెందిన గేదె మృతి చెందినట్లు తెలిపారు. కాగా బాధితుడు జీవనాధారమైన గేదె సుమారు రూ.1,50,000 విలువ గల గేదె పిడుగుపాటుకు మృతి చెందడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

జిల్లావ్యాప్తంగా వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి…

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మోటకొండూరు మండలం 158. 5  శాతం వర్షపాతం నమోదు కాగా, భువనగిరి మండలం నందనంలో 80.5, వలిగొండ మండలం వర్కట్పల్లిలో 76.3, సంస్థాన్ నారాయణపురంలో 73.3, బొమ్మలరామారం మరియాలలో 65.0,  చౌటుప్పల్ లో 60.0, బోనగిరి పట్టణంలో 55.5, ఆత్మకూరులో 36.8, యాదగిరిగుట్టలో 36.5, గుండాలలో 35.8, పోచంపల్లిలో 33.5, బీబీనగర్లో 32.5, రామన్నపేటలో 22.5, అడ్డ గూడూరులో 22.3, వలికొండలో 20.3, మోత్కూర్లో 17.8, తుర్కపల్లిలో  15.0, ఆలేరులో 12. 0, రాజపేటలో 9.5 వర్షపాతం నమోదయింది. కాగా మూట కొండూరు మండల కేంద్రంలో  అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వర్షాపాత నమోదు గణాంక  అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -