హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో మాట్లాడుతూ,’ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకోవడంతోపాటు తనకి, యోధులుకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి తను ఎంత దూరం వెళ్తాడు?, తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్తాడు?, ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మొత్తం దాదాపు 9 యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే ఛాలెంజ్‌గా అనిపించింది. ఎన్ని రిస్కులు, ఛాలెంజ్‌లు తీసుకున్నా సరే.. ఆడియన్స్ రిలీజ్ రోజు ఎంత థ్రిల్ అవుతారు అనేదే గుర్తొస్తుంటుంది. శ్రియ, జగపతిబాబుతో నేను చిన్నప్పుడు కలిసి నటించాను. వాళ్ళందరితో మళ్ళీ ఇప్పుడు కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒక పెద్ద డేంజర్ క్రియేట్ చేయగల క్యారెక్టర్. హీరో ఎలా ఎదుర్కోగలడు అనిపించేలా ఉండే క్యారెక్టర్. హరి గౌర సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత విశ్వప్రసాద్ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయన స్వేచ్ఛ ఇవ్వడం వల్ల మాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇది పక్కా క్లీన్ ఫ్యామిలీ సినిమా. పిల్లలు, పెద్దలు అందరూ సకుటుంబంగా విచ్చేసి థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఇది తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
క్లీన్ ఫ్యామిలీ సినిమా
- Advertisement -
- Advertisement -