Friday, September 12, 2025
E-PAPER
Homeసినిమాకచ్చితంగా భయపెడతాం

కచ్చితంగా భయపెడతాం

- Advertisement -

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన మిస్టీరియస్‌ అకల్ట్‌ థ్రిల్లర్‌ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. డైరెక్టర్లు అనిల్‌ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్‌ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ,’ తెలుగు ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చాలా హార్డ్‌ వర్క్‌ చేసి చేసాం. భయపెట్టడం కూడా ఒక ఆర్ట్‌. ఈ సినిమాతో ఆడియన్స్‌ని భయపెడతాం. మంచి విజువల్‌, సౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఒక మంచి కథ చూశామనే శాటిస్ఫాక్షన్‌ ఉంటుంది. అద్భుతమైన కథ చేసిన మా డైరెక్టర్‌ కౌశిక్‌కి థ్యాంక్స్‌. చిన్మయి గ్రేట్‌ విజువల్స్‌ ఇచ్చారు. చైతన్‌ భరద్వాజ్‌ తన మ్యూజిక్‌తో బద్దలు కొట్టేశారు. ఫస్ట్‌ ఫ్రేం నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ఆడియన్స్‌ లీనమైపోతారు. మీ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. నేను చాలామంది ప్రొడ్యూసర్స్‌ని చూశాను. సాహు చాలా మంచి ప్రొడ్యూసర్‌. ఇంత మంచి ప్రొడ్యూసర్‌ ఇండిస్టీలో ఉండాలి. మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. పది మంచి సినిమాలు వస్తే ఇండిస్టీ బాగుంటుంది. అర్చన చాలా సపోర్ట్‌ చేశారు. అనుపమ, నేను ‘రాక్షసుడు’తో మంచి హిట్‌ కొట్టాం. అందరూ ‘రాక్షసుడు 2’ ఎప్పుడు అని అడిగారు. కానీ దానికి మించిన సినిమా చేసాం. ఈ సినిమా చూశాక ‘కిష్కింధపురి 2′ ఎప్పుడని అడుగుతారు’ అని తెలిపారు. ‘చాలా హర్రర్‌ సినిమాలు వస్తుంటాయి. కానీ ఇందులో హర్రర్‌తోపాటు ఓ అద్భుతమైన సోల్‌ ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని నిర్మాత సాహు గారపాటి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -