Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌కు అరుదైన గ్లోబల్‌ గౌరవం

కేటీఆర్‌కు అరుదైన గ్లోబల్‌ గౌరవం

- Advertisement -

న్యూయార్క్‌లో ‘గ్రీన్‌ లీడర్‌షిప్‌’ అవార్డు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్‌ లీడర్‌షిప్‌ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్‌ 24న న్యూయార్క్‌లో 9వ ఎన్‌ వైసీ గ్రీన్‌ స్కూల్‌ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్‌ మెంటార్స్‌ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలియజేసింది. ”గ్రీన్‌ మెంటార్స్‌ తరపున, గ్రీన్‌ లీడర్‌షిప్‌ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం” అని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -