కుల్కచర్లలో రైతుల ఆందోళన
ఎస్‌ఐ కాళ్లమీద పడ్డ రైతు
నవతెలంగాణ-కుల్కచర్ల, పూడూర్
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వికారాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం పూడూర్, పెద్దముల్ మండలాల్లో రైతులు బారులు తీరగా.. కుల్కచర్లలో రోడ్డెక్కారు. పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ అగ్రోస్, చంగోముల్ రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆందోళన చేస్తున్న రైతులను ఎస్‌ఐ రమేష్‌కుమార్ జోక్యం చేసుకొని రైతుల ఆందోళనను విరమించే ప్రయత్నం చేయగా.. ఓ రైతు ఎస్‌ఐ కాళ్లపై పడి యూరియా ఇప్పించాలని కన్నీరు పెట్టుకున్నాడు. ఎస్‌ఐ రమేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి యూరియా వస్తుందని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.