తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి
వ్యవసాయ మార్కెట్లో ఫర్టిలైజర్ షాపు వద్ద నిరసన
నవతెలంగాణ – వనపర్తి
చిన్న సన్న కారు రైతులందరికీ, తమ పొలాలకు సరిపడేంత యూరియాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్లో రాఘవేంద్ర ఫర్టిలైజర్ షాప్ దగ్గర రైతులకు యూరియా ఇవ్వాలని శుక్రవారం నిరసన తెలిపారు. కలెక్టర్, వ్యవసాయ అధికారులు మాత్రం రైతులకు సరిపడా యూరియా ఉన్నదని చెబుతున్న రైతులకు సకాలంలో సరిపడేంత యూరియాను అందజేయడంలో పిఎసిఏసీలు ఫర్టిలైజర్ షాపులు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు.
నాలుగు, ఐదు, ఆరు ఎకరాలు నాటిన రైతులకు ఒక బస్తా యూరియా ఇస్తే ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. అధికారులు ఎకరాకు ఒక బస్తా అంటున్నారని, షాపు వారు స్టాక్ లేక ఒక వ్యక్తికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారన్నారు. పంటలకు సకాలంలో యూరియా అందించకపోతే దిగుబడి తక్కువ వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. రైతులు సింగల్ విండో ఆఫీసుల దగ్గర ఫర్టిలైజర్ షాపుల దగ్గర ఉదయం నుండి పడిగాపులు కాస్తూ యూరియా కోసం వేచి చూడవలసి వస్తుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా బదులు న్యానో యూరియా లిక్విడ్ ఇవ్వాలని, గతంలో ప్రయత్నాలు చేసి విఫలమైనదన్నారు. అధికారులు స్పందించి తక్షణమే రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, లేనిపక్షంలో రైతులను పెద్ద ఎత్తున సమకూర్చి ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అనిల్, శ్రీనివాసులు, నరసింహ, రాములు, మోహన్, వెంకటేష్, బాలయ్య, నిలమ్మ, బుచ్చన్న, బాబు, మహేష,తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES