మధ్యలో చదువు మనేసినవారు వినియోగించుకొవాలి
మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టిఓఎస్ఎస్) ద్వారా విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించిన 10వ తరగతి,ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, చదువు మధ్యలో మనేసినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10వ తరగతి చదవడానికి ఆగస్టు 31, 2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసినవారు, ఇంటర్మీడియట్ చదవడానికి 10వ తరగతి పాస్ అయినవారు, కనీసం 15 సంవత్సరాలు వయస్సు ఉండాలని తెలిపారు. ఇది రెగ్యులర్ స్కూల్/కాలేజీకి వెళ్ళలేని వారికి మంచి అవకాశమన్నారు.
10వ తరగతి,ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్లు లభిస్తాయన్నారు. ఆ సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు,ఉద్యోగాలు, టెక్నికల్ కోర్సులు చేసుకోవచ్చని సూచించారు.ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సైన్స్, గణితం, సామాజిక శాస్త్రం, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు నేర్చుకోవచ్చన్నారు. ఇందుకు కావలసిన పత్రాలు పుట్టినతేది ధృవీకరణ పత్రం,టిసి,మార్క్ మెమో,ఇంటర్మీడియట్ అడ్మిషన్‌కి కులం/రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అవసరమన్నారు.10వ తరగతికి పిజు రూ.1150,ఇంటర్మీడియట్ కు రూ.1500 లన్నారు. చదువు ఆగిపోయినవారు, మళ్లీ మొదలు పెట్టాలని ఆశపడుతున్న వారికీ మంచి సదవకాశమన్నారు. అర్హతలు కలిగిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు మండల పరిషత్ కార్యాలయంలో కానీ లేదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ వెంకట్ ను సంప్రదించాలన్నారు.
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES