బీ ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లో ఫర్టిలైజర్స్ షాప్ యాజనులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ రైతులను అనేక ఇబ్బందులకు గురించేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఫర్టిలైజర్స్ షాప్ ల పై చర్యలు తీసుకోవాలని బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ రోజంతా ఎరువుల దుకాణల ముందు క్యూలో నిలబడ్డా ఒక బస్తా కుడా రైతులకు దొరకడం కష్టంగా మారిందన్నారు.యూరియా పంపిణి పై విచారణ జరిపించాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
హుస్నాబాద్ లో పర్మెంట్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి నియమించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించు కోకపోవడం వలనే ఎరువుల దుకాణల యాజమానులు ఇష్ట రాజ్యాం నడుస్తున్నట్లు ఉందన్నారు. ఇప్పటి కైన ఉన్నతాధికారులు రైతులు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ నాయకులు మేకల వికాస్ యాదవ్, మాలోతు సత్యం నాయక్ ,భూక్యా కృష్ణ నాయక్, మాలోతు మోహన్ నాయక్ ,మూడవత్ శ్రీనివాస్, తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.