ఎఐఎస్ఎఫ్ నాయకుల వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్లలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఎఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్, కో కన్వీనర్ చందు డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అన్ని హాస్టల్ లలో మౌళిక వసతులు మెరుగుపరచాలని ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మామిడాల ప్రవీణ్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మాట్లాడుతూ తెలంగాణకే తలమానికంగా ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు నిత్యం సమస్యలతో సతమతమ వుతున్నారని తెలిపారు. భోజనంలో నాణ్యత లోపించిందని, త్రాగునీరు, పారిశుద్ధ్యం పట్ల నిర్వహణా లోపం వుందని విమర్శించారు. హాస్టల్ గదులలో ఫ్యాన్ లు, లైట్ ల మరమ్మతులు లేని కారణంగా, రాత్రి వేళల్లో, విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంజీవ్, చందు, ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ హాస్టల్లలో విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES