Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హంగర్గలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హంగర్గలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని హంగర్గ గ్రామంలో ఓ వ్యవసాయ భూమిలో అంతర పంటలో భాగంగా గంజాయి సాగు చేస్తున్నట్టు విశ్వసినియ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన వీరేశం అనే రైతు తను వ్యవసాయ భూమిలో కంది, సోయా పంటలు సాగు చేస్తున్న శివారు భూమిలో అంతర పంటగా 147 గంజాయి మొక్కలను పండించినట్టు పోలీసుల విచారణలో తేలింది. జుక్కల్ ఎమ్మార్వో మారుతి, ఆర్ఐ రాంపాటేలతో కలిసి జుక్కల్ ఎక్సైజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంట పొలాలను పరిశీలించారు.

రైతు వీరేశంను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న రైతు విషయం ఆప్కారి అధికారులకు ముందే తెలుసునని, అయినా పట్టించుకోకపోవడం వారి అవివేకమని మండల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం పెద్దగుల్లా, కౌలాస్ పరిధిలోని వ్యవసాయ భూమిలో పత్తి పంటలో అంతర పంటగా భారీగా గంజాయి సాగు చేసిన విషయం పాఠకులకు తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో , అటవీ ప్రాంతాల వ్యవసాయ భూములలో, ఎకరాల పరిధిలో వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నారని తెలిసిన ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యంలో ప్రజలు ఉన్నారని మండల వాసులు ఆరోపణలు చేస్తున్నారు. మామూళ్లకే పరిమితమైన ఎక్సైజ్ అధికారుల పైన ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలని మండల వాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -