నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో ‘స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని అమలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఆదేశించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన సమావేశం లో డాక్టర్స్,జిల్లా గ్రామీణ అభివృద్ధి, జిల్లా పంచాయతీ, విద్యా, శిశు, సంక్షేమ, మున్సిపాలిటీ, సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 17.9.2025 నుండి2.10.2025 వరకుఅన్నిఆరోగ్యకేంద్రాలలో మహిళల కొరకు మెడికల్ క్యాంప్ లో స్పెషలిస్ట్ డాక్టర్స్ తో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని మహిళా ఆరోగ్యం పట్ల పక్షం రోజులు గ్రామస్థాయి నుంచి మున్సిపాలిటీ వరకు అన్ని చోట్ల ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని వారికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలను ప్రత్యేక స్పెషలిస్ట్ వైద్యులచేత నిర్వహించాలని మాత శిశు రోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రాథమిక దశలో క్యాన్సర్ సంబంధిత వ్యాధులను పరీక్షచాలని,స్కూల్, హాస్టల్ పిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు .
ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ పై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని రక్త నిధుల కేంద్రాల్లో అన్ని గ్రూపుల రక్తం నిలువలు ఉండాలని ప్రత్యేకంగా సికిల్ సెల్ అనే మీనియా పై గర్భిణీ స్త్రీలకు 12వ వారంలో పరీక్ష నిర్వహించాలని ఆంటినేటల్ కేర్ ఇమ్మ్యూనై్సేషన్ పై ప్రత్యేక శ్రద్ధ కనబడుచాలని ఆడపిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత అనీమియా మీనిష్ట్రల్ సైకిల్ పై అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అడిషనల్ డైరెక్టర్ కళ్యాణి జెడ్పి సీఈవో శోభారాణి డిఆర్డిఓ నాగిరెడ్డి, డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ యశోద,డిఈఓ సత్య నారాయణ, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు మరియు మున్సిపల్ కమిషనర్ డిసిహెచ్ఎస్ చిన్ననాయక్,జిల్లా ప్రోగ్రామ్ అధికారులు పి హెచ్పా సి ల్గొన్నారు.