భర్త, కారు డ్రైవర్ తో కలిసి హత్య చేసిన సంగీత
వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య
నవతెలంగాణ – పాలకుర్తి
ఆస్తికోసం తల్లిని చంపిన కూతురుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వర్ధన్నపేట ఏసీపి అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలం లోని పెద్ద తండా క గ్రామానికి చెందిన బాధావత లక్ష్మి 42, భర్త 15 సంవత్సరాల క్రితం చనిపోయాడని తెలిపారు. లక్ష్మీ కుమార్తె సంగీత పాలకుర్తి మండలం లోని దుబ్బ తండా ఎస్పీ గ్రామానికి చెందిన భూక్య వీరన్న ప్రేమ వివాహం చేస్తదని తెలిపారు. భూక్య లక్ష్మికి ఉన్న ఆస్తిలో 20 గుంటల భూమిని కుమార్తెకు ఇచ్చిందని, గత రెండు నెలల క్రితం మరో 20 గుంటల భూమిని అమ్మడంతో వచ్చిన డబ్బులతో ఎనిమిది తులాల బంగారాన్ని సంగీతకు కొనిచ్చిందని తెలిపారు. మూడు లక్షలు నగదు ఇచ్చిందని వివరించారు.
లక్ష్మికి అప్పులు ఉండడంతో ఐదు లక్షల నగదు తో పాటు 20 గుంటల భూమి తన పోషణ నిమిత్తం ఉంచుకుందని తెలిపారు. 5 లక్షలతోపాటు ఉన్న 20 గుంటల భూమిని, జనగామ లో ఉన్న ఇంటి ప్లాటును తనకు ఇవ్వాలని లక్ష్మీ కుమార్తె సంగీత తరచూ గొడవపడేదని తెలిపారు. లక్ష్మీ వినకపోవడంతో హత్య చేయడమే మార్గమని ఎంచుకొని హత్యానంతరం ఆస్తి దక్కుతుందని పథకం వేశారని తెలిపారు. ఈనెల 9న రాత్రి 12 గంటల ప్రాంతంలో పెద్ద తండా కేకు సంగీత తో పాటు భర్త వీరన్న, కారు డ్రైవర్ భూక్య సామ్రాజ్ చేరుకున్నారని వివరించారు. అందరూ పడుకున్న తర్వాత లక్ష్మీని పథకం ప్రకారం హత్య చేశారని వివరించారు.
సంగీత దిండుతో ముఖపై గట్టిగా పట్టుకుందని, వీరన్న గొంతు నులిమాడని, కారు డ్రైవర్ సామ్రాజ్ కాళ్లు పట్టుకున్నాడని తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను శుక్రవారం శాతపురం క్రాస్ వద్ద పట్టుకొని అరెస్టు చేశామని తెలిపారు. హత్య చేసేందుకు తీసుకువచ్చిన కారును స్వాధీన పరుచుకొని సీజ్ చేశామని తెలిపారు. ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేయడం సభ్య సమాజం తలదించుకుందని వివరించారు. హత్యలే ఆస్తులకు పరిష్కారం కాదని, సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకునేందుకు కృషిచేసిన పోలీస్ కానిస్టేబుల్ లను జనగామ డిసిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎస్ఐలు దూలం పవన్ కుమార్, ఎండి యాకూబ్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ జి సోమిరెడ్డి, కానిస్టేబుళ్లు బి రమేష్, బి రాజ్ కుమార్, పి యాకన్న, పి మనోజ్ కుమార్, ఎం రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES