– తొలగని టారిఫ్ విభేదాలు
– కెనడా ప్రధాని కార్నె వెల్లడి
ఒట్టావా: అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌తో విస్తృతాంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపినట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నె మంగళవారం తెలిపారు. అయితే టారిఫ్‌ల ఎత్తివేతపై, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా కలిపేసుకుంటామనే అంశాలపై ఇరువురు నేతల మధ్య విభేదాలు అలాగే వున్నాయని సీబీసీ న్యూస్ తెలిపింది. సమావేశానంతరం వాషింగ్టన్‌లో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కార్నె, రాబోయే వారాల్లో మరిన్ని సార్లు సంప్రదింపులు జరపాలని తాను, ట్రంప్ నిర్ణయించామని చెప్పారు. అలాగే జి7 సదస్సులో కూడా ముఖాముఖి భేటీ కానున్నట్టు చెప్పారు. ట్రంప్ తానేది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారని వ్యాఖ్యానిస్తూ 51వ రాష్ట్రమన్న ఐడియా పదే పదే పునరుద్ఘాటించడం వల్ల ఉపయోగమేమీ లేదన్నారు. రెండు సార్వభౌమ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన అర్ధం చేసుకున్నారని అన్నారు. వాణిజ్య యుద్ధాన్ని ముగించే విషయంలో పురోగతి సాధించారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, పరిష్కారాలు కనుగొనేందుకే జరిగిన చర్చలివని వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్ మాత్రం టారిఫ్‌లు కొనసాగుతాయనే స్పష్టం చేశారని, ఆ విషయమై తాము చూడాల్సి వుందని కార్నె చెప్పారు.
ట్రంప్‌తో నిర్మాణాత్మక చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES