నవతెలంగాణ – చారకొండ
మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన జూలూరు వెంకటరమణ ప్రమోషన్ పై బదిలీ అయ్యారు. వంగూరు మండలంలోని రంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బయలుదేరిన సందర్భంగా పాఠశాల తరఫున,గ్రామ పెద్దల సమక్షంలో వెంకటరమణ,దంపతులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు శివరామకృష్ణ, గ్రామ పెద్దలు మాజీ వైస్ ఎంపీపీ బాధగోని సాంబయ్య గౌడ్,మాజీ ఉప సర్పంచ్ సోప్పరి పర్వతాలు,మాజీ ఉపాధ్యాయులు పెద్దలు సీతారాములు,గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి,రఘు మారెడ్డి, మాజీ వార్డు మెంబర్ సందడి లక్ష్మమ్మ, పదవి విరమణ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు దేవేందర్, గోపాల్,అంగన్వాడి ఉపాధ్యాయులు భాగ్యమ్మ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలికేశ్వరం నారయ్య,యువకులు చిలికేశ్వరం శంకర్,చరణ్ రామస్వామి పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు ప్రమోషన్ పై బదిలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES