Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

- Advertisement -

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు
నవతెలంగాణ – ఆలేరు రూలర్

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన  భోజనం పెట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు అన్నారు. శుక్రవారం ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు.ఉపాధ్యాయులకు ఫిజికల్ సైన్స్ ట్రైనింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. డిజిటల్ క్లాస్ ఎలా చెబుతున్నారో అని ఉపాధ్యాయులతో కలిసి క్లాస్ ను అదనపు కలెక్టర్ వినడం జరిగింది. అనంతరం కొలనుపాక లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల  పనులను పరిశీలించారు.ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయిన వారికి  వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -