- Advertisement -
నిందితునిపై కేసు నమోదు
నవతెలంగాణ – దుబ్బాక
అమ్మేందుకు ట్రాక్టర్ లో తరలిస్తున్న 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భూంపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్సై హరీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పుసుకూరి సతీష్.. పలు గ్రామాల్లోని రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని పౌల్ట్రీ ఫారాలకు ఎక్కువ ధరకు అమ్ముతుంటాడు. ఈ క్రమంలో సతీష్ శుక్రవారం రేషన్ బియ్యాన్ని అమ్మేందుకు ట్రాక్టర్ లో తరలిస్తుండగా ఎస్ఐ హరీష్ పట్టుకుని నిందితునిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని మిరుదొడ్డిలోని ఎంఎల్ఎస్ పాయింట్ కి తరలించడం జరిగిందన్నారు.
- Advertisement -