Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ శాఖ ఎవరికి తొత్తుగా వ్యవహరించదు

పోలీస్ శాఖ ఎవరికి తొత్తుగా వ్యవహరించదు

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే మాట తీరు మార్చుకోవాలి
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

పోలీస్ శాఖ ఏ పార్టీ కో, ఏ వ్యక్తి కో తొత్తుగా వ్యవహరించదని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమాండో కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలకు లోబడి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అహర్నిశలు పనిచేస్తుందన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి పోలీసులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన, అనుచిత వ్యాఖ్యలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఆర్పూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజే లను నిషేధిస్తూ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటే దీనిని తప్పుగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రతినిధులు చందూలాల్, సాయిలు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -