వర్షాకాలంలో బొద్దింకలు, బల్లుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే తేమ బొద్దింకలు, ఇతర కీటకాలకు అనుకూల వాతావరణం. బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్.. ఇలా ఎక్కడ చూసినా అవి కనిపిస్తూఉంటాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధులను వ్యాపింపజేస్తాయి. బల్లులు కూడా అంతే డేంజర్.
వీటిని ఇంటి నుంచి తరిమికొట్టడానికి పెస్టిసైడ్స్, కెమికల్ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే వీటికి చెక్ పెట్టవచ్చు. ఇల్లు తుడిచేటప్పుడు (మాపింగ్) నీటిలో వీటిని వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కర్పూరం, లవంగం నూనె : 5 నుంచి 6 కర్పూరం బిళ్లలను పొడిగా చేసుకుని నీటిలో కలపాలి. దీంట్లో లవంగం నూనె పోసి మాపింగ్ చేసుకోవాలి. కర్పూరం, లవంగాల నుంచి వచ్చే బలమైన వాసన బొద్దింకలు, బల్లులను ఇంట్లో ఉండనివ్వదు. ఫ్లోరింగ్ కూడా క్లీన్ అవుతుంది. లవంగాలను లేదా లవంగం పొడిని మూలల్లో, డోర్ల వద్ద పెడితే కీటకాలు ఇంట్లోకి రావు.
ఉల్లిపాయ, వెల్లుల్లి రసం : వీటి రసాన్ని నీటిలో కలిపి ఇంట్లో స్ప్రే చేసుకోవచ్చు. లేదా వీటిని బకెట్ నీటిలో కలిపి ఫ్లోర్ క్లీన్ చేయవచ్చు. వీటి బలమైన, ఘాటైన వాసన బల్లులు, బొద్దింకలను తిప్పికొడుతుంది. ఫర్నిచర్, ఇంటి మూలలు, ఎంట్రీ పాయింట్ల వద్ద ఈ లిక్విడ్ స్ప్రే చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ, పచ్చి వెల్లుల్లి రెబ్బలను అక్కడక్కడ పెడితే బల్లలు, బొద్దింకలు ఇంట్లో తిరగవు.
వెనిగర్, బేకింగ్ సోడా : ఇంటిని ఎంత క్లీన్ చేసినా కీటకాలు మళ్లీ మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, కిచెన్‌లో లభించే వెనిగర్, తినే సోడాతో ఈ సమస్య పోతుంది. వెనిగర్, వంట సోడాను మాపింగ్ వేసే నీటిలో కలిపి క్లీన్ చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ నుంచి వచ్చే వాసన.. బల్లులు, కీటకాలు, బొద్దింకలకు పడదు. దీంతో, వాటంతట అవే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి.
ఉప్పు, నిమ్మరసం : మాపింగ్ వేసే నీటిలో 4 నుంచి 5 చెంచాల ఉప్పు, నిమ్మకాయల రసం కలిపి శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుంది. ఈ లిక్విడ్‌ను ఫ్లోరింగ్‌పైనే కాకుండా గోడలపై కూడా స్ప్రే చేసుకోవచ్చు. మూలల్లో దాక్కున్న బొద్దింకల సమస్యను ఇది పరిష్కరిస్తుంది.
కాఫీ, పొగాకు : కాఫీ పౌడర్, పొగాకు మిశ్రమాన్ని బల్లులు తింటే అది వాటికి ప్రాణాంతక విషంలా మారుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న బాల్స్ రూపంలో చేసి కిటికీలు, తలుపుల దగ్గర టూత్‌పిక్‌లపై ఉంచండి. అయితే, పెంపుడు జంతువులు ఉన్నవారు వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
బొద్దింకలు, బల్లుల బెడద వుంటే…
- Advertisement -
- Advertisement -