Saturday, September 13, 2025
E-PAPER
Homeవరంగల్పాస్ పుస్తకాల కోసం నెలల తరబడి నిరీక్షణ.?

పాస్ పుస్తకాల కోసం నెలల తరబడి నిరీక్షణ.?

- Advertisement -

పట్టా పాస్ బుక్ లేకపోవడంతో రుణాలివ్వని బ్యాంకులు
ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ-మల్హర్ రావు.

పట్టాదారు పాస్ పుస్తకాలు అందక రైతులు అవస్థలు పడుతున్నారు.మండలంలో కొత్తగా భూములను కొనుగోలు చేసిన అనేక మంది పాస్ పుస్తకాల కోసం మూడు, నాలుగు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.300 వసూలు చేస్తున్నారు. గతంలో పాస్ పుస్తకం ఉన్న వారు భూమిని కొనుగోలు చేస్తే అందులోనే వివరాలను నమోదు చేసి ఇస్తున్నారు.

3 నుంచి 5 రిజిస్ట్రేషన్లు..

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూములను తహశీల్దార్ కార్యాలయంలోనే రిజి స్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేసి, రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రొసీడింగ్ కాపీ, డూప్లికేట్ పీపీలను అందిస్తున్నా రు.అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలు సీసీఎల్ కార్యాలయం ద్వారా బెంగళూరులోని ఏజెన్సీకి వెళ్తాయి. అక్కడ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట కొత్త పాస్ పుస్తకం ముద్రించి పోస్టులో ఇంటికి పంపిస్తారు.మండలంలో 3 నుంచి 5 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా గత నాలుగైదు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సుమారు వంద మందికి ఇప్పటి వరకు పట్టాపాస్ పుస్తకాలు అందలేదు.

బ్యాంకర్ల విముఖత..

కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు పంట రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.తహసీల్ కార్యాలయంలో ఇచ్చే రిజిస్ట్రేషన్ ప త్రాలు, ప్రాసీడింగ్ కాపీలను చూపినా పంటరుణా లు ఇచ్చేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. వాస్తవానికి భూ భారతి వెబ్పోర్టల్లో రైతు వివరాలను పరిశీలించి పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ, బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పట్టా పాస్ పుస్తకం పరిశీలన తర్వాతే రుణాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.

పత్రాలు సరిపోతాయి..
రెవెన్యూ అధికారులు

వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నాం. పాస్ పుస్తకం లేకపోయినా ఆన్లైన్లో వివరాలను పరిశీలించి బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు పోస్టులో రావడానికి కొంత సమయం పడుతుంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -