మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆధునీకరణను చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం హైదరాబాద్‌లో సచివాలయంలోని తన కార్యాలయంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ అభివృద్ధిó, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్‌తో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రులు సూచించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టే ఆధునీకరణ పనులు గిరిజనుల సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే మేడారం ఆలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారని తెలిపారు. వచ్చే వారంలో సీఎం స్వయంగా క్షేత్రస్ధాయి పరిశీలనకు వస్తున్నందున తగు ప్రణాళికలు, సమాచారంతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES