Saturday, September 13, 2025
E-PAPER
Homeబీజినెస్భెల్‌కు రైల్వే ఉంచి రూ.23 కోట్ల ఆర్డర్‌

భెల్‌కు రైల్వే ఉంచి రూ.23 కోట్ల ఆర్డర్‌

- Advertisement -

బెంగళూరు : ప్రభుత్వ రంగంలోని ప్రముఖ విద్యుత్‌ ఉత్పత్తి పరికరాలు, ఇంజనీరింగ్‌ కంపెనీ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) కవాచ్‌ ఎక్విప్‌మెంట్‌ సరఫరా కోసం భారత రైల్వేస్‌ నుంచి రూ. 22.87 కోట్ల విలువైన ఆర్డర్‌ సాధిం చింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆటోమెటిక్‌ ట్రెయిన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌నకు సంబంధించిన కవాచ్‌ పరికరాలను సరఫరా, ఇన్‌స్టాల్‌ చేసి ఇవ్వనుంది. ఈ ఆర్డర్‌ను సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే నుంచి పొందినట్లు శుక్రవారం భెల్‌ రెగ్యూలేటరీ సంస్థలకు సమా చారం ఇచ్చింది. దీనికి సంబంధించి భారత రైల్వే శాఖ నుంచి సెప్టెంబర్‌ 11న లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఒఐ)ని పొందినట్లు తెలిపింది. ఇది లోకో మోటివ్‌లలో ఆన్‌ బోర్డ్‌ కవాచ్‌ ఎక్విప ్‌మెంట్‌ డిజైన్‌, అభివృద్ధి, సరఫరా, ఇన్‌స్టాలేషన్‌, ట్రయల్‌, కమిషనింగ్‌ సంబంధిత పనులు చేసి ఇవ్వనున్నట్లు పేర్కొంది. కవాచ్‌ ఎక్విప్‌మెంట్‌ను బెంగళూరులోని భెల్‌ ప్లాంట్‌లో తయారు చేయనుంది. 18 నెలల్లోపు ఆర్డర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -