ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పెరగడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ అధికారులు 8 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 1,17,240 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 64,720 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,495 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6,325 క్యూసెక్కులు, ఎస్‌ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం కొనసాగే అవకాశముందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
సాగర్‌కు పెరిగిన వరద నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES