కార్మిక హక్కులను కాపాడుకోవాలి
టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) : సూర్యాపేట రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్
నవతెలంగాణ-సూర్యాపేట
వాతావరణ కాలుష్య రహిత ఉద్దేశంతో తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీనే నిర్వహించే విధంగా నిధులు కేటాయించి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు బస్సులను కార్పొరేట్లకు అప్పగించడం వల్ల సబ్సిడీ ప్రయివేటు వ్యక్తులకే చెంది లాభం చేకూరుతుందని అన్నారు. ఆర్టీసీ నిర్వహణలో మాత్రం సంస్థకు తీవ్రమైన నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ స్థలాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, దీనివల్ల సంస్థ తీవ్రమైన సంక్షేభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని వాపోయారు.
ప్రస్తుతం 575 విద్యుత్ బస్సులు రాష్ట్రంలో నడుస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్లు మెకానిక్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ నిర్వహించే విధంగా మార్పులు తేవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి కార్మికులకు పెరుగుతున్న పని భారాలను అరికట్టాలన్నారు. ఆర్టీసీ రక్షణ -కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, 2021 వేతన సవరణ వెంటనే చేయాలని అన్ని రకాల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యమ్రంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు డి.రవి, వి.లక్ష్మయ్య, నాయకులు రాజయ్య, నాగమల్లు, రమేష్, పిచ్చయ్య, వెంకన్న, యాకమ్మ, సంధ్య, సైదమ్మ, రాజేశ్వరి, ధనలక్మి, స్వరూప, లక్ష్మి, ఉపేందర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు తేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES