ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతోపాటు మహిళలూ ప్రముఖ పాత్ర వహించారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో తంగెళ్ల వెంకటచంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఐద్వా జిల్లా వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటాలో స్త్రీలు పురుషులతో సమానంగా పోరాటాలు చేశారని తెలిపారు. కులమతాలకతీతంగా, అణిచివేత, దోపిడీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వారి పాత్ర అమోఘం అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్.. చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లింల వివాదంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పోరాటాలపై తప్పుడు వక్రీకరణలు చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు మేకన బోయిన సైదమ్మ, జూలకంటి విజయలక్ష్మి, జిల్లా ఆఫీస్ బేరర్స్ సురభి లక్ష్మి, షేక్ ఖాజాబీ, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలోమహిళల విరోచిత పాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES