- Advertisement -
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 15న జరగాల్సిన కామారెడ్డి బహిరంగ సభ భారీ వర్ష సూచన కారణంగా వాయిదా వేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తర్వాత తెలియజేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా మహేశ్‌కుమార్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ బహిరంగ సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా పార్టీ సీనియన్ నాయకులు సభ నిర్వహణ ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో బహిరంగసభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -