Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రానికి 11,930 మెట్రిక్‌ టన్నుల యూరియా

రాష్ట్రానికి 11,930 మెట్రిక్‌ టన్నుల యూరియా

- Advertisement -

రెండ్రోజుల క్రితం 23వేల మెట్రిక్‌ టన్నులు :వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రానికి కేంద్రం నుంచి శుక్రవారం 11,930 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రెండు రోజుల క్రితం 23000 మెట్రిక్‌ టన్నులు సరఫరా అయిందని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్‌ టన్నుల యూరియా రానుందని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో యూరియా సరఫరాలపై వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, డైరెక్టర్‌ గోపితో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని ఆర్‌ఈసీఎల్‌ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలంటూ అధికారులకు సూచించారు. రాష్ట్రం లోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు.

మంత్రి తుమ్మలతో ఆఫ్రికన్‌ ప్రతినిధుల భేటీ
వ్యవసాయ, విత్తనోత్పత్తి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని స్వయంగా తెలుసుకునేందుకు ఆఫ్రికన్‌ ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయం లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమ లు చేస్తున్న పలు పథకాలను, విత్తనోత్పత్తి రంగంలో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో సాధించిన విజయాలను మంత్రి వారికి వివరిం చారు. విత్తన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని పెంపొందించుకుంటామని తెలిపారు.

ఇక్రిశాట్‌ ప్రతినిధులతో మంత్రి భేటీ
రాష్ట్ర వ్యవసాయాభివృద్ధి కోసం ఇక్రిశాట్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఇక్రిశాట్‌ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. చిక్కుళ్ళు, తృణధాన్యాల్లో మెరుగైన రకాలతోపాటు, వివిధ పంటలలో తాము అమలు చేస్తున్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులను ఇక్రిశాట్‌ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భం గా మంత్రి వ్యవసాయ రంగంలో ఇక్రిశాట్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -