Saturday, September 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో కర్ఫ్యూ ఎత్తివేత‌

నేపాల్‌లో కర్ఫ్యూ ఎత్తివేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సోషల్‌ మీడియాపై నిషేధం విధించడంతో.. నేపాల్‌లో జెన్‌ – జెడ్‌ ఆందోళనకారులు తీవ్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దీంతో కొన్నిరోజుల నుంచి నేపాల్‌లో అశాంతి నెలకొంది. దీంతో అక్కడ ఆర్మీ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేదుకు ఆ దేశధ్యక్షుడు రామచంద్ర పౌడల్‌, ఆర్మీ, జెన్‌ జెడ్‌ ఆందోళనకారులతో చర్చలు జరిపి.. ఎట్టకేలకు తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు స్వీకరించేందుకు ఒప్పించారు. శుక్రవారం ఆమె తాత్కాలిక ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో విధించిన కర్ఫ్యూని ఎత్తివేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఆంక్షలు ఎత్తివేయడంతో.. పబ్లిక్‌ రవాణా ఈరోజు నుంచే ప్రారంభమైంది. బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని ఖాట్మాండు పోస్టు పత్రిక, పలు మీడియా ఛానళ్లు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -