Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలుదేవిరోడ్ లో వన్ వే ప్రారంభం..

దేవిరోడ్ లో వన్ వే ప్రారంభం..

- Advertisement -

ప్రజలు సహకరించాలి 
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్లో వన్ వేణు ప్రారంభించినట్లు నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ శుక్రవారం రాత్రి తెలియజేశారు. కావున నిజామాబాద్ ప్రజలు వన్ వేణు దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. నిజాంబాద్ నగరం లో దేవి రోడ్ యందు వివిధ వ్యాపార సముదాయలు, బ్యాంకు లకు పని నిమిత్తం మరియు టెంపుల్స్ దర్శనం కొరకు అధిక మొత్తంలో ప్రజలు దేవి రోడ్డు కు రావడం వలన వారి వాహనాలకు వాహనాల పార్కింగ్ కొరకు తగిన స్థలం లేనందున రోడ్డుపై పార్కుచేయడం వల్ల, నిత్యం రద్దీ ప్రాంతం అయినా దేవి రోడ్డులో తరుచుగా ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.

ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజాంబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాల్ అలీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిబ్బంది బారికేడ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వన్ వే ఏర్పాటు చేసినారు, వాహనదారులు రైల్వే ఫ్లై ఓవర్ వైపు నుండి, గంజ్ గేట్ వైపు నుండి ద్విచక్ర వాహనదారులు దేవి రోడ్ కి వచ్చి సాయి రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద నుండి బయటకు వెళ్ళ వలెను అని తెలియజేశారు.  హెవీ వెహికల్స్, ఫోర్ వీలర్స్ కి ప్రవేశం లేదు. ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ వారు ఏర్పాటు చేసిన వన్ వే ద్వారా మాత్రమే వెళ్ళ వలేనని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -