Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి యం, సిద్ధారామిరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల   ప్రధానోపాధ్యాయులకు, సైన్స్ టీచర్లు QUANTUM AGE BEGINS శీర్షిక పైన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ ఈ నెల 15న లయోలా హై స్కూల్ కామారెడ్డి లో నిర్వహించడం జరుగుతుందన్నారు. 15 న ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందనీ, సెమినార్ లో పాల్గొనే విద్యార్థులు charts లేదా ppt ల సహాయంతో 6 నిమిషాలు టాపిక్ మీద సెమినార్ ఇవ్వవలసి ఉంటుంది. రెండు నిమిషాలు నియమించబడిన న్యాయ నిర్నేతల ద్వారా  వివా ఉంటుంది.  మిగతా వివరాలు ప్రొసీడింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రొసీడింగ్ను విద్యాశాఖ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చున్నారు.  ప్రధానోపాధ్యాయులు ఈ సెమినార్లో పాల్గొనే విద్యార్థులకు సెక్యూరిటీగా ఒక 10 టీచర్ సహాయంతో పంపించలన్నారు. మిగతా వివరాలకు జిల్లా సైన్స్ అధికారి   ని (9697982888) ద్వారా సంప్రదించగలరనీ ఆయన పేర్కొన్నారు.     

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -