నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ నసిరుద్దీన్ పని నిమిత్తం పాల్వంచ గ్రామానికి వెళ్ళారు. అక్కడ హౌస్ ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తుండగా కరెంట్ షాక్ రావడంతో చెతి వేళ్లకు గాయాలు అయ్యాయి. వైద్యం చేయించుకున్న ఆ గాయాలు నయం కాకపోవడం, నెల రోజులుగా చేతి వేళ్ళు పనిచేయడం లేదు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈసారి ప్రయివేట్ హాస్పిటల్ లో చూయించుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. దీంతో విషయం తెలుసుకున్న టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వారిని తన ఇంటికి పిలిపించుకొని ప్రయివేట్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడారు. అదేవిధంగా బాదితుడికి రూ.12, వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్లు, చాట్ల వంశీ, పిడుగు మమతా సాయిబాబా, పంపరి లతా శ్రీనివాస్, ఉన్నారు.
ప్రమాద బాదితుడికి ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES