నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్
నవతెలంగాణ – కంఠేశ్వర్
సమాజంలో విద్య, వైద్య రంగాలకు జోస్ అలుక్కాస్ సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కొనియాడారు. శనివారం జోస్ అలుక్కాస్ జువెలరీ షోరూం మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ప్రాధాన్యతా రంగాలైన ఆసుపత్రులకు, పాఠశాలకు అవసరమైన ఇన్ఫాస్ట్రక్చర్ వార్షికోత్సవ సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలు సమకూరుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం మూడో స్ఫూర్తిదాయకంగా నిలవడం గర్వకారణమన్నారు. నాలుగు ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.6.96 లక్షల విలువగల కంప్యూటర్ లు, డిజిటల్ టీవీ, తాగునీటి శుద్ధి యంత్రం లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించడం హర్షణీయమన్నారు.
ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బంగారు, వజ్రాభరణాల వ్యాపారంలో నమ్మకమైన సంస్థగా ప్రఖ్యాతి గడించిన జోస్ అలుక్కాస్ జువెలరీ షోరూం వ్యాపారం లో అభివృద్ధి చెంది సమాజసేవలను విస్తరించాలని కోరారు. ప్రతి ఒక్కరు సంస్థ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజసేవలో వివిధ రంగాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ప్రతి రూ. 75 వేల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు పై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ పాఠశాలకు ఎంపీ చేతుల మీదుగా సీఎస్ ఆర్ ఫండ్ చెక్కులను అందజేశారు. కేక్ కట్ చేసి మూడో వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధనిష్, అసిస్టెంట్ మేనేజర్ సంజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పీఆర్వో పిప్పెర నరేందర్, తదితర సిబ్బంది, ప్రతినిధులు పాల్గొన్నారు.