Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ఆరోపణలు సరికాదు 

అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ఆరోపణలు సరికాదు 

- Advertisement -

– భీంగల్ ఐసిడిఎస్ సిడిపిఓ స్వర్ణలత
– బషీరాబాద్ లో అంగన్వాడి కేంద్రాల తనిఖీ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కమ్మర్ పల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని భీంగల్ ఐసిడిఎస్ సిడిపిఓ స్వర్ణలత తెలిపారు. శనివారం మండలంలోని బషీరాబాద్ లో అంగన్వాడి కేంద్రాలను ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు సిడిపివో స్వర్ణలత తనిఖీ చేశారు, అంగన్వాడి కేంద్రంలో అందని పౌష్టికాహారం పేరుతో ఓ పత్రికలో వచ్చిన కథనం మేరకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో సిడిపివో స్వర్ణలత అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రం పరిధిలోని లబ్ధిదారులను పిలిపించి విచారించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా  తమ పిల్లలకు ప్రీస్కూల్ విద్య, పౌష్టికాహారం సక్రమంగా అందుతుందని, ఎలాంటి ఇబ్బందులు, లోపాలు లేవని లబ్ధిదారులు అందరూ ముక్తకంఠంతో సిడిపివోకు వివరించారు.

లబ్ధిదారులకు ఇవ్వకుండా అంగన్వాడీ టీచర్లు పాల ప్యాకెట్లను స్వీట్ హోమ్ లకు విక్రయించుకుంటున్నారనే వార్తలో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అంగన్వాడి టీచర్లందరూ సమయపాలన పాటిస్తున్నారని, టి హెచ్ ఆర్ పిల్లలకు అన్ని సరుకులు సక్రమంగా అందుతున్నాయని ఎలాంటి లోపాలు లేవని లబ్ధిదారులు సిడిపివో కు  తెలిపారు.కొందరు కావాలని నిరాధారమైన ఆరోపణలతో అంగన్వాడి కేంద్రాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. అధికారులకు ఎలాంటి ముడుపులు ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ ద్వారా అందలేదనే విషయం బషీరాబాద్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాల తనిఖీ సందర్భంగా విచారణలో తేలిందన్నారు.కార్యక్రమంలో ఏసీడీపీవో జ్ఞానేశ్వరి, ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు గంగ హంస, బషీరాబాద్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శివానంద్, డాక్టర్ నర్సయ్య, నేల్ల హరీష్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -