Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొర్లికొండ ఎస్సీ హాస్టల్ లో పేరేంట్స్ మీటింగ్

తొర్లికొండ ఎస్సీ హాస్టల్ లో పేరేంట్స్ మీటింగ్

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రన్ పల్లి మండలం తొర్లి కొండ గ్రామంలోని ఎస్సీ హాస్టల్ నందు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సహాయ అధికారి రోడ్డ రాజ గంగారాం  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జిల్లాలో అంతట నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, ఆహార పదార్థాల విషయం  ,ఆరోగ్యము, ఆవాసం, విద్యార్థులకు మనోధైర్యం కల్పించడం  తదితర విషయాలపై  విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి రోడ్డ రాజా గంగారం, హాస్టల్ వార్డెన్ సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ కమిటీ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -