నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన వందే భారత్ రైలు త్వరలోనే నిజామాబాద్ ముంబై మధ్య ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ అర్వింద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2015 కాలంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా మధ్య రైల్వే లైన్ పై అప్పటి సీఎం కేసీఆర్ సంతకం చేయలేదని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ సొంత నిధులతో సంబంధిత రైల్వే లైన్ పూర్తి చేనున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అతిపెద్దదైన వ్యాపార వాణిజ రంగాలను ప్రోత్సహించేందుకుగాను కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చేందుకు తన వంతు కృషి జరుగుతుందని పేర్కొన్నారు. గడిచిన ప్రభుత్వం హయాంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణంతోపాటు, కొత్త రైల్వే లైన్లో నిర్మాణాలకు అప్పటి పాలకుల అవినీతి అక్రమాలకు కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనవంతుగా ఒత్తిడి తెచ్చి వ్యాపారులకు అన్ని విధాలుగా సహకరిస్తానని ఎంపీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా రాజు మాట్లాడుతూ..తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.జిల్లాలో 30 ఏళ్లుగా సేవలందిస్తున్న కమిటీకి సారథ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన హయాంలో నూతన భవనం నిర్మిస్తామన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడు రాజు, కార్యదర్శిగా శ్రీనివాసరావుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నిజామాబాద్ నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిజామాబాద్ కు త్వరలో వందే భారత్ రైలు: ఎంపీ అరవింద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES