నవతెలంగాణ – జన్నారం
అడవి పందులు పంట ధ్వంసం చేసిన రైతులకు అటవీ అధికారులు పంట నష్ట పరిహారం అందించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. శనివారం మండలంలోని ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని గోండు గూడెంకు చెందిన వెడమ మారుతి, దుర్గం శంకరయ్య ఇతర రైతుల మొక్కజొన్న పంటలను అడవి పందులు ధ్వంసం చేయగా ఆ పంటలను వారు పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ గ్రామంలో రైతుల మొక్కజొన్న జొన్న పంటలు దాదాపు 6 ఎకరాల వరకు అడవి పందులు ధ్వంసం చేశాయన్నారు. ఒక ఎకరానికి 50 వేల వరకు నష్టం జరిగిందని అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, అడవి పందులు ధ్వంసం చేసిన పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు.
అడవి పందులు పంట ధ్వంసం చేసిన రైతులకు నష్టపరిహారం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES