ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఆత్మ సంస్థ ఉన్నట్టా-లేనట్టా ఒకవేళ ఉంటే ఆత్మానీధులతో జిల్లా రైతులను వివిధ పంటలు వాటి సాగు పై రైతులను చైతన్య పరచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం( ఏఐకేఎంఎస్ )జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ భవన్ లో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఆత్మ సంస్థ కార్యక్రమాలు చేపట్టడం లేదని వారన్నారు. ఈ సంస్థ ద్వారా రైతులను వివిధ పంటలు వాటి సాగు వివరాలు తెలిపేందుకుగాను ఇతర ప్రాంతాలకు శాస్త్రవేత్తలను తీసుకువెళ్లి వారిని చైతన్యపరిచే విధంగా వారికి శిక్షణ తరగతులు నిర్వహించి పంటలపై చైతన్య పరచాలన్నారు.
కానీ వాటి కార్యక్రమాల ఊసే లేదని ఈ మధ్యకాలంలో కనబడడం లేదని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంస్థకు తగిన నిధులు కేటాయించి ఆత్మను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రైతుల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని జిల్లా లో 48,128 వేల ఎకరాల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెగిన చెరువులు కుంటలను మరమ్మత్తులు చేయాలని, కూలిన ఇళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి మంచిప్ప 3.5 టిఎంసిల నిర్మాణంలో చేపట్టిన ప్రాజెక్టులో 21 ప్యాకేజ్ పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ఈ పథకానికి రూ.1500 కోట్లు విడుదల చేసి పనులను పూర్తి చేయాలి అన్నారు.
21 ప్యాకేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయకపోతే ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వాలు సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరాలు ఇవ్వలేదని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యంత్ర పరికరాలను ఇవ్వాలని ,ఎస్సీ ఎస్టీ రైతులకు 80% ఇతర చిన్న సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీపై వాటిని అందించాలని ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి ఉపాధ్యక్షులు ఎల్, పరువయ్య. బి.సాయిలు . సహాయ కార్యదర్శులు, బన్సీ ,శ్రీనివాస్ రెడ్డి ,నాయకులు విఠల్. పోషన్న, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మ నిధులతో రైతులను చైతన్య పరచాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES