Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలుభారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు పూర్తి ..

భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు పూర్తి ..

- Advertisement -

పిఅర్. ఏఈ. గంగా కిరణ్ వెల్లడి..
నవతెలంగాణ – డిచ్ పల్లి

గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గాను పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయి ప్రజల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, యుద్ధ ప్రతిపాదికన రూ.17 లక్షల 24 వేలతో పనులను చేయించినట్లు ఇందల్ వాయి పంచాయతీ రాజ్ ఏఈ గంగా కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి నుండి చంద్రయాన్ పల్లి వరకు,వెంగళ్ పాడ్ నుండి నల్లవేల్లి వరకు, పిడ్లుడి రోడ్డు నుండి దేవీ తండా వరకు, సంస్థాన్ సిర్నపల్లి నుండి రాం సాగర్ తండా వరకు, డోంకల్ రోడ్డు నుండి గుట్టా కింది తండా మధ్యలో పలుచోట్ల డ్రైనేజీలు ,రహదారులు కొట్టుకొని పోయాయని ఆయన వివరించారు.

యుద్ధ ప్రతిపాదికన తాత్కారికంగా రోడ్డు డ్రైనేజీ పనులను చేయించినట్లు ఏ ఈ గంగా కిరణ్ తెలిపారు. మండలం మొత్తంలో బీ టి రోడ్డు కు దాదాపు ఒక కోటి అరవై లక్షల రూపాయలు మేరా నష్టం చేకూరినట్లు అయన వివరించారు. ఈ అంచనాలు దాదాపు ఉంటుందని, ప్రస్తుతం శాశ్వత మరమ్మతుల కోసం రూ.1 కోటి 60 లక్షల ప్రతిపాదనాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -