ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలున్నా.. నా దృష్టికి తీసుకురావాలి
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్దదారులు బిల్లుల మంజూరులో గాని, ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005995991 కి ఫోన్ చేసి సమస్యను తెలుపవచ్చని, మా దృష్టికి తీసుకువచ్చిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరి బిల్లులో మంజూరు కావటం లేదని, వారికి త్వరలో బిల్లులు అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇసుక అవసరమున్న లబ్ధదారులు తహసిల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుకను పొందవచ్చనీ, అవసరమున్నవారు తహసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన నారెడ్డి మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES